TG: హైదరాబాద్ నగరంలో ఈసారి చవితి ఉత్సవాలకు నాగోల్ కేంద్రంగా మారుతోంది. ఖైరతాబాద్ 69 అడుగుల గణేషుడిని మించి, తిరంగ్ యూత్ అసోసియేషన్ 72 అడుగుల అష్టసిద్ధి మహాగణపతి మట్టి విగ్రహాన్ని రూపొందిస్తోంది. 21 మంది కార్మికులు నెలరోజులుగా శ్రమిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ సందేశంతో పూర్తిగా మట్టితో తయారవుతున్న ఈ విగ్రహం, ఈ ఏడాది భాగ్యనగరంలోనే అతిపెద్ద గణేషుడిగా నిలవనుంది.
వార్తలు
భాగ్యనగరంలో మరో మహా గణపతి విగ్రహం


