TG: దేశ భద్రత విషయంలో మోదీ సర్కార్ కఠినంగా వ్యవహరిస్తోందని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. ఇబ్రహీంపట్నంలోని NSG శిక్షణ కేంద్రంలో గార్డ్స్ కుటుంబాలకు నిర్మించిన 48 గృహ సముదాయాలను NSG డైరెక్టర్ జనరల్ సంజయ్ సింఘాల్‌తో కలిసి బండి సంజయ్ ప్రారంభించారు. దేశ రక్షణ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, సరిహద్దు భద్రతను మరింత పటిష్ఠం చేస్తున్నట్లు తెలిపారు.
వార్తలు
దేశ భద్రతలో రాజీ లేదు: బండి సంజయ్


