హైదరాబాద్: 28°C
వార్తలు

చర్లపల్లి నుంచి గోరఖ్‌పూర్‌కు కొత్త రైలు

హైదరాబాద్ నుంచి యూపీకి ప్రయాణించే వారికి ద.మ. రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. చర్లపల్లి టెర్మినల్ నుంచి గోరఖ్‌పూర్ జంక్షన్ మధ్య కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ (22075/22076) రైలును ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ నాన్-ఏసీ సూపర్ ఫాస్ట్ రైలు సర్వీసులు అక్టోబర్ నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఈ రైలు వారానికి ఒకసారి రెండు దిశల్లోనూ రాకపోకలు సాగిస్తుంది.