హైదరాబాద్: 28°C
వార్తలు

కీలక బిల్లులపై ప్రభుత్వం ఫోకస్

AP: రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం పలు కీలక బిల్లులను సభ ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. వైసీపీ హయాంలో తీసుకొచ్చిన దిశ చట్టాన్ని ఉపసంహరించుకునే బిల్లు, స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రాజకీయ రిజర్వేషన్లు, పీపీపీ పాలసీ-2026తో పాటు రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించిన పలు నిర్ణయాలు కూడా సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.