బీజేపీ కేరళం ఉపాధ్యక్షుడు పదవికి నటుడు ఎస్.దేవన్ రాజీనామా చేశారు. అలాగే, పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని వదులుకుంటున్నట్లు తెలిపారు. అలప్పుళలోని ఓ ఆలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజీనామా విషయాన్ని ఆయన ప్రకటించారు. తన నిర్ణయానికి సరైన వేదిక ఇదేనని భావిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రానికి చెందిన పలువురు బీజేపీ నేతలు ఆ వేదికపై ఉన్న సమయంలోనే దేవన్ ఈ విషయాన్ని వెల్లడించారు.
వార్తలు
బీజేపీ ఉపాధ్యక్ష పదవికి నటుడు రాజీనామా


