హైదరాబాద్: 28°C
వార్తలు

విమానాశ్రయంలో తుపాకీ మిస్‌ఫైర్.. నలుగురి గాయాలు

యూపీ వారణాసి విమానాశ్రయంలో తుపాకీ మిస్‌ఫైర్ అవ్వడం కలకలం రేపింది. ఈ ఘటనలో ఇద్దరు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. మరో మహిళ కాలికి బుల్లెట్ తగలడంతో గాయపడింది. అలాగే మరో వ్యక్తి బొటనవేలికి బుల్లెట్ తగిలింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది క్షతగాత్రులను ట్రామా సెంటర్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎయిర్‌పోర్టుకు చేరుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.