AP: సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా మంత్రి సవిత ఆయన చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. బీసీల సింహం, ముద్దుబిడ్డగా పేరొందిన లచ్చన్న బీసీలు, రైతులు, కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడారని కొనియాడారు. ఆయన పోరాట స్ఫూర్తి, ప్రజాసేవ, దేశభక్తి నేటి తరానికి ఆదర్శమన్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
వార్తలు
బీసీల ముద్దుబిడ్డ గౌతు లచ్చన్న: మంత్రి


