పశ్చిమ బెంగాల్ నదియా జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. పంద్రాగస్టు వేడుకల్లో భాగంగా జరిగిన హింసాత్మక ఘటనల్లో కాంగ్రెస్ సీనియర్ నేత రెహమాన్, ఆయన కుమారుడు అబు సుఫియాన్ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు వారి కారును అడ్డగించి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో తండ్రికొడుకులు ఘటనాస్థలంలోనే మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.
వార్తలు
కాంగ్రెస్ నేత, అతడి కుమారుడి దారుణ హత్య


