హైదరాబాద్: 28°C
వార్తలు

వందేమాతరం నియమాలను పాటించాల్సిందే: మాజీ ఉపరాష్ట్రపతి

వందేమాతరం గీతాలాపన సమయంలో కాంగ్రెస్ అగ్రనేతల తీరుపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు. జాతీయ గేయమైన వందేమాతరం విషయంలో ఎలాంటి వివాదాలు తలెత్తకూడదని పేర్కొన్నారు. వందేమాతరాన్ని దేశం మొత్తం ఆమోదించిందని, స్వాతంత్య్రానికి పూర్వమే కాంగ్రెస్ కూడా దీన్ని సంపూర్ణంగా అంగీకరించిందని తెలిపారు. ఈ గేయ నియమాలను ప్రతి ఒక్కరూ గౌరవించి, కచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.