హైదరాబాద్: 28°C
వార్తలు

వాజ్‌పేయి మాటల్లో.. మన 'భారతం'

'భారతదేశం కేవలం భూభాగం కాదు, ఇదొక సజీవ మూర్తి. ఇదొక వందన, అభినందన భూమి. ఇక్కడి ప్రతి రాయి ఒక శంకరుడు, ప్రతి నీటి బొట్టు పవిత్ర గంగాజలం. మనం బతికినా, చనిపోయినా ఈ దేశం కోసమే' అంటూ మాతృభూమిపై అటల్ బిహారీ వాజ్‌పేయి చెప్పిన మాటలు సదా స్ఫూర్తిదాయకం. దేశభక్తిని రగిలించే ఈ అద్భుతమైన వ్యాఖ్యలు ప్రతి భారతీయుడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి.