హైదరాబాద్: 28°C
వార్తలు

చరిత్రలో నిలిచిపోయిన ఆ ఒక్క ఓటు!

భారత రాజకీయ చరిత్రలో 1999 విశ్వాస పరీక్ష ఓ సంచలనం. వాజ్‌పేయి నేతృత్వంలోని NDA సర్కార్‌కు అన్నాడీఎంకే మద్దతు ఉపసంహరించుకోవడంతో లోక్‌సభలో బలపరీక్ష అనివార్యమైంది. ఇందులో ప్రభుత్వానికి అనుకూలంగా 269, వ్యతిరేకంగా 270 ఓట్లు పడ్డాయి. ఆ ఒక్క ఓటు తేడాతో ఆయన ప్రధాని పదవి కోల్పోయారు. ఒక్క ఓటుతో ప్రభుత్వం పడిపోవడం ప్రజాస్వామ్య చరిత్రలో NDA పాలిట చీకటి ఘట్టంగా నిలిచింది.