హైదరాబాద్: 28°C
వార్తలు

ఏ పార్టీ అధికారంలో ఉన్నా స్కూళ్లు మారలేదు: దీప్కే

దేశంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రభుత్వ పాఠశాలల దుస్థితి మారలేదని సీజేపీ అధినేత అభిజీత్ తెలిపారు. మహారాష్ట్ర సంతుక్‌ పింప్రీలో జడ్పీ హైస్కూల్‌ను సందర్శించి.. అక్కడ విద్యార్థులకు కనీస వసతులు లేకపోవడంపై మండిపడ్డారు. గత పదేళ్లలో దేశవ్యాప్తంగా 94వేల పైచిలుకు ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయని తెలిపారు. కొత్త బడులు తెరవాల్సిన చోట ఉన్నవి మూసేస్తే దేశం ఎలా బాగుపడుతుందన్నారు.