దిమాగీ నక్సలైట్లుపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. అసమ్మతిని అణచివేయడానికే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తింది. ఇది మోదీ నిస్సహాయతకు స్పష్టమైన సంకేతమని పేర్కొంది. ఇతరులపై నిందలు వేయడంలో ప్రధాని ఆరితేరిపోయారని.. మొత్తం రాజకీయ శాస్త్రంలోనే ఆయన మాస్టర్ అబ్యూజర్(ఎంఏ) అంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ విమర్శించారు.
వార్తలు
మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపాటు


