హైదరాబాద్: 28°C
వార్తలు

ఒమర్ అబ్దుల్లాపై బీజేపీ మండిపాటు

జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా చేసిన పీవోకే, రాష్ట్ర హోదా వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర బీజేపీ నాయకుడు సునీల్ శర్మ మండిపడ్డారు. సీఎం బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని ధ్వజమెత్తారు. జాతీయ పండుగ రోజు జెండాను గౌరవించకుండా, తన ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికల గురించి మాట్లాడాల్సిన వేదికను సీఎం రాజకీయంగా వాడుకోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు.