జార్ఖండ్ లాతెహార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ట్రక్కు అదుపుతప్పి ఆటో, ద్విచక్రవాహనంపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని స్థానికుల సాయంతో మృతదేహాలను ఆటో నుంచి బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి అతి వేగమే కారణమని ప్రాథమికంగా గుర్తించారు.
వార్తలు
రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి


