AP: తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లేక్సులు, నారాయణగిరి షెడ్లన్నీ భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. ఎలాంటి టోకెన్లు లేని సర్వదర్శనానికి ప్రస్తుతం 24 గంటల సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో భక్తులు ఉదయం పూట మాత్రమే క్యూలైన్లలోకి ప్రవేశించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. రద్దీకి తగినట్లుగా స్వామివారి దర్శన ఏర్పాట్లు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.
వార్తలు
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ


