AP: నంద్యాలలో స్వాతంత్ర్య దినోత్సవం రోజున జరిగిన వివాహ వేడుకలో నవదంపతులు చైతన్య, వీర శైలజ దేశభక్తిని చాటుకున్నారు. వేదికపై జాతీయ జెండా చేతబూని త్రివర్ణ పతాకానికి సెల్యూట్ చేశారు. బంధుమిత్రులతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఆగస్టు 15న పెళ్లి జరగడం అదృష్టంగా భావిస్తున్నామని వారు తెలిపారు. దేశభక్తి చాటుకున్న ఈ జంటను నెటిజన్లు అభినందిస్తున్నారు.
వార్తలు
పెళ్లి వేడుకలో దేశభక్తి చాటుకున్న నవదంపతులు


