AP: పోలీసుశాఖలో విశేష సేవలందించిన ఇన్‌స్పెక్టర్ మామిడి గోవిందరావు కేంద్ర ప్రభుత్వ మెరిటోరియస్ పురస్కారాన్ని అందుకున్నారు. అమరావతిలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేశారు. విధి నిర్వహణలో అంకితభావం, క్రమశిక్షణ కనబరిచిన గోవిందరావు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ పురస్కారం లభించడం పట్ల పలువురు ఆయనను అభినందించారు.
వార్తలు
పోలీసుశాఖలో విశేష సేవ.. జాతీయ స్థాయి గుర్తింపు


