హైదరాబాద్: 28°C
వార్తలు

'అక్రమ కేసులకు భయపడేది లేదు'

AP: కూటమి ప్రభుత్వం అక్రమ కేసులతో వేధిస్తోందని నంద్యాల జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి మండిపడ్డారు. వైఎస్‌ జగన్‌ పర్యటనకు వస్తున్న ప్రజాదరణ చూసి తప్పుడు కేసులు పెట్టారన్నారు. జగన్‌తో ప్రజలకు మేలు జరుగుతుందని, ఈ కేసులకు తాము భయపడే ప్రసక్తే లేదన్నారు. ప్రజా సమస్యలపై న్యాయపోరాటానికి సిద్ధమని స్పష్టం చేశారు.