హైదరాబాద్: 28°C
వార్తలు

సీఎం పర్యటనకు ఏర్పాట్లు పూర్తి 

TG: సీఎం రేవంత్ రెడ్డి ములుగు జిల్లా పర్యటన ఏర్పాట్లను మంత్రి సీతక్క పరిశీలించారు. మేడారంలో సమ్మక్క-సారలమ్మలను దర్శించుకుని, ములుగులో నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం, పంచాయతీరాజ్ రహదారుల అభివృద్ధి పైలాన్‌ను సీఎం ప్రారంభించనున్నారు. అధికారులంతా సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.