AP: భోగాపురం విమానాశ్రయం భద్రత విషయంలో రాజీపడం అని CISF డీజీ ప్రవీణ్ రంజన్ అన్నారు. ప్రయాణికులతో స్నేహపూర్వకంగా ఉంటూ సేవలందిస్తామని తెలిపారు. యాజమాన్యం, విమానయాన, ఇతర భాగస్వామ్య సంస్థలతో సమన్వయంతో పనిచేస్తూ కార్యకలాపాలు సురక్షితంగా జరిగేలా కృషి చేస్తామని వెల్లడించారు. తొలిరోజు నుంచే దేశీయ, అంతర్జాతీయ సర్వీసులు నడిపేందుకు భోగాపురం సిద్ధంగా ఉండటం గొప్ప విజయంగా పేర్కొన్నారు.
వార్తలు
'విమానాశ్రయం భద్రత విషయంలో రాజీపడం'


