హైదరాబాద్: 28°C
వార్తలు

కొండచిలువ మృతి... ఊపిరి పీల్చుకున్న గ్రామస్తులు

MHBD: తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో గత రెండు రోజుల క్రితం కొండచిలువ ప్రత్యక్షమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్థానిక సర్పంచ్ ముద్ధం సునీత వీరారెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ ఆలయ పరిసరాలను జేసీబీ సహాయంతో చదును చేయిస్తున్న క్రమంలో కొండచిలువ మృతి చెందింది. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.