హైదరాబాద్: 28°C
వార్తలు

ఆల్ స్టేట్ స్విమ్మింగ్‌లో రాపర్తి సుశాంత్ ప్రతిభ

WGL: హైదరాబాద్‌లో నిర్వహించిన ఆల్ స్టేట్ స్విమ్మింగ్ 200 మీటర్ల పోటీల్లో వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం ముచింపుల గ్రామానికి చెందిన రాపర్తి సుశాంత్ ఉత్తమ ప్రతిభ కనబరిచారు. వేగం, నైపుణ్యంతో ఆకట్టుకున్న సుశాంత్ ప్రతిభకు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేశారు.