హైదరాబాద్: 28°C
వార్తలు

'జాతీయ పక్షిని రక్షించిన ఫారెస్ట్ అధికారులు'

 NZB: వేల్పూర్ మండలం లక్కోర్ గ్రామ రహదారిపై ప్రమాదానికి గురైన జాతీయ పక్షి నెమలిని ఆర్మూర్ ఫారెస్ట్ అధికారులు రక్షించారు. స్థానికుల సమాచారంతో ఎఫ్‌ఆర్‌ఓబీ అరుణ్‌కుమార్, డిప్యూటీ ఎఫ్‌ఆర్‌ఓ శ్రీదేవి నెమలిని ఫారెస్ట్ కార్యాలయానికి తరలించి చికిత్స అందించారు. అనంతరం నెమలిని సురక్షితంగా అడవిలోకి వదిలేశారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సిబ్బంది పాల్గొన్నారు.