హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: భయపెట్టిస్తున్న కోతుల గుంపులు

WGL: నగరంలోని కరీమాబాద్, పెరకవాడ ప్రాంతాలలో కోతుల బెడదతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పదుల సంఖ్యలో కోతులు గుంపులుగా తిరుగుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయన్నారు. ఇంట్లోకి చొరబడి తినుబండారాలు తీసుకెళ్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. అధికారులు స్పందించి, ప్రత్యేక చొరవ తీసుకొని కోతుల బెడద తీర్చాలని కోరుతున్నారు.