హైదరాబాద్: 28°C
వార్తలు

సీతారామ పనుల్లో జాప్యం వద్దు: మంత్రి

BDK: బీజీ కొత్తూరులో సీతారామ ఎత్తిపోతల పథకం పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. డిస్ట్రిబ్యూటరీ కాలువల భూసేకరణ, పైప్‌లైన్ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నెలాఖరులోగా నీటిని విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే ఏడాది జూన్ నాటికి మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యమన్నారు.