హైదరాబాద్: 28°C
క్రీడలు

లంచ్ బ్రేక్‌.. భారత్ 101/1

గాలె వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు తొలి సెషన్ ముగిసే సమయానికి టీమిండియా 101/1 పరుగులు చేసింది. క్రీజులో దేవదత్ పడిక్కల్ 35, కేఎల్ రాహుల్ 32పరుగులతో ఉన్నారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 54 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అంతకుముందు ఓపెనర్ యశస్వి జైస్వాల్ 32 పరుగుల వద్ద రనౌట్‌గా వెనుదిరిగాడు. లంచ్ విరామం సమయానికి భారత్ మంచి స్థితిలో నిలిచింది.