హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

అరగంట ఇలా నడిస్తే మంచిదట!

జపనీస్‌ వాకింగ్‌ పద్ధతి (ఇంటర్వెల్‌ వాకింగ్‌) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అరగంట సమయం పెట్టుకొని.. 3 నిమిషాలు వేగంగా, మరో 3 నిమిషాలు సాధారణ వేగంతో నడవాలి. ఇలా చేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. అలాగే టైప్‌-2 మధుమేహం రిస్క్‌ తగ్గి, కండరాలు, ఎముకలు బలపడతాయి. మానసిక ఆందోళనలు తొలగి ప్రశాంతమైన నిద్ర సొంతమవుతుంది.