హైదరాబాద్: 28°C
వ్యాపారం

అవయవదానంపై అవగాహన అవసరం: సౌజన్య

SRD: అవయవదానంపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య అన్నారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ఇవాళ నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. అవయవదానంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణ పాల్గొన్నారు.