హైదరాబాద్: 28°C
క్రీడలు

పాక్ క్రికెటర్లపై సంచలన వ్యాఖ్యలు

పాకిస్థాన్ యువ క్రికెటర్లు ఆటను మెరుగుపరుచుకోవడం కంటే డబ్బు సంపాదనపై ఎక్కువ దృష్టి పెడుతున్నారని మాజీ సెలెక్టర్ ఇక్బాల్ ఖాసిమ్ విమర్శించారు. దేశం కోసం ఆడటాన్ని గౌరవంగా భావించే రోజులు తగ్గుతున్నాయని పేర్కొన్నారు. నైపుణ్యాలను పెంచుకుని, పరిస్థితులకు అనుగుణంగా ఆడటంపై యువ ఆటగాళ్లు దృష్టి పెట్టాలని సూచించారు. ప్రతిభతో విజయాలు సాధిస్తే సంపాదన కూడా సహజంగానే వస్తుందన్నారు.