హైదరాబాద్: 28°C
భక్తి

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. అన్ని కంపార్టుమెంట్లు నిండి శిలాతోరణం వరకు భక్తులు క్యూలైన్‌లో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 79,956 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ.4.46 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.