తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయి శిలాతోరణం వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న ఒక్కరోజే 81,064 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, అందులో 33,136 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.36 కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.
భక్తి
శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు


