తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనానికి కంపార్టుమెంట్లన్నీ నిండి శిలాతోరణం వరకు భక్తులు క్యూలైన్‌లో వేచిఉన్నారు. నిన్న శ్రీవారిని 87,179 మంది భక్తులు దర్శించుకున్నారు. 34,256 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.59 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
భక్తి
శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు


