హైదరాబాద్: 28°C
భక్తి

శ్రీవారి దర్శనానికి 20 గంటలు

AP: తిరుమలలో భక్తుల రద్దీ భారీగా కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. దర్శనం కోసం అక్టోపస్ భవనం వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 87,658 మంది భక్తులు దర్శించుకోగా.. 40,606 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.13 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.