హైదరాబాద్: 28°C
భక్తి

శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు

తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనం కోసం భక్తులు పోటెత్తడంతో క్యూలైన్ శిలాతోరణం వరకు ఉంది. దీంతో స్వామివారి దర్శనానికి దాదాపు 20 గంటల సమయం పడుతోంది. కాగా, నిన్న ఒక్కరోజే 77,502 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.46 కోట్లుగా నమోదైందని టీటీడీ అధికారులు వెల్లడించారు.