తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనానికి శిలాతోరణం వరకు భక్తులు క్యూలైన్‌లో వేచి ఉన్నారు. క్యూలైన్లలో భక్తులకు అధికారులు అన్ని వసతులు కల్పించారు. నిన్న శ్రీవారిని 77,384 మంది భక్తులు దర్శించుకున్నారు. 31,129 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.72 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
భక్తి
శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు


