హైదరాబాద్: 28°C
వ్యాపారం

డాబర్ ఇండియా సంస్థకు FSSAI షాక్

డాబర్ ఇండియా సంస్థకు FSSAI షాక్ ఇచ్చింది. తేనే, ఆవు నెయ్యి, వంట నూనెలు వంటి పలు ఉత్పత్తులను విక్రయించకుండా ఆ సంస్థపై నిషేధం విధించింది. 100 శాతం నాణ్యత అని లేబులింగ్ చేయటం చట్టవిరుద్ధమని పేర్కొంది. ఇలా 100 శాతం స్వచ్ఛత అనే లేబుల్ ఉన్న అన్ని ఆహార ఉత్పత్తుల అమ్మకాలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంపై 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని నోటీసులు పంపించింది.