హైదరాబాద్: 28°C
వార్తలు

సరిహద్దులో 250 ఫిరంగులను మోహరించిన పాక్

భారత సరిహద్దులో 250 ఫిరంగులను పాకిస్తాన్ మోహరించినట్లు తెలుస్తోంది. కీలక ప్రాంతాల్లో ఉంచినట్లు నిఘా వర్గాలు చెప్పాయని ఇండియా టుడే వెల్లడించింది. SH-15 ట్రక్-మౌంటెడ్ సెల్ఫ్ ప్రొపెల్డ్ ఫిరంగులను చైనాలో తయారు చేశారని పేర్కొంది. 155MM ఫిరంగి వ్యవస్థలు 72km వరకు దాడి చేయగలవని సమాచారం. నిమిషానికి 6 రౌండ్లు ఫైర్ చేయగలవని, అడ్వాన్స్‌డ్ కంట్రోల్ సిస్టమ్ ఉన్నట్లు తెలుస్తోంది.