అర్థం: చేతి లేదా కాలి వేలి గోరు చుట్టూ ఇన్ఫెక్షన్ వస్తే పుండు ఏర్పడి విపరీతమైన నొప్పి వస్తుంది. అలా తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నప్పుడు ఆ వేలిపై రోకలి పడితే ఆ బాధ మరింత పెరుగుతుంది. అలాగే ఒక వ్యక్తి ఇప్పటికే ఒక పెద్ద సమస్య లేదా కష్టంతో బాధపడుతుంటే.. మరో కొత్త సమస్య వస్తే ఆ బాధ మరింత పెరుగుతుంది. ఆ సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు.
వార్తలు
సామెత: గోరుచుట్టు మీద రోకటి పోటు


