హైదరాబాద్: 28°C
వ్యాపారం

అత్యంత విలువైన కంపెనీగా 'యాపిల్'

ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా యాపిల్ నిలిచింది. చిప్ తయారీ సంస్థ ఎన్‌విడియాను అధిగమించి యాపిల్ అగ్రస్థానానికి చేరింది. ఎన్‌విడియా షేర్లు సోమవారం 5% నష్టపోవడంతో, ఆ కంపెనీ మార్కెట్ విలువ 4.77 లక్షల కోట్ల డాలర్లకు పడిపోయింది. అదే సమయంలో యాపిల్ షేర్ల విలువ పెరిగింది. దీంతో యాపిల్ మార్కెట్ విలువ 4.95 లక్షల కోట్ల డాలర్లకు చేరి, అగ్రస్థానంలో నిలిచింది.