హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ఎక్కువగా నడిచి.. తక్కువగా కూర్చోండి

గంటల తరబడి ఒకేచోట కూర్చోవడం ఊబకాయం, గుండె జబ్బులకే కాకుండా మెదడు ఆరోగ్యానికి తీవ్ర హానికరం. ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల వృద్ధాప్యంలో మతిమరుపు వచ్చే అవకాశం పెరుగుతుంది. ప్రతి గంటకు ఒకసారి లేచి 2-3 నిమిషాలు నడవటం లేదా శరీరాన్ని స్ట్రెచ్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఎక్కువగా నడవడం వల్ల ఆలోచనా స్పష్టత పెరుగుతుంది, మెదడులోని వాపు తగ్గి మెదడు వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది.