హైదరాబాద్: 28°C
వార్తలు

ఆందోళనలు ఉద్ధృతం చేయాలి: యువజన కాంగ్రెస్

NRPT: మక్తల్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యువజన కాంగ్రెస్ సమావేశం జరిగింది. నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు వేణు గౌడ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆందోళనలను ఉద్ధృతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మండలాల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.