హైదరాబాద్: 28°C
వార్తలు

రూ.60 లక్షల మరమ్మతులు.. రెండేళ్లకే బీటలు

HNK: ఆత్మకూరు మండల కేంద్రంలో పెద్ద చెరువు కట్ట మరమ్మతులు పూర్తై రెండేళ్లకే పగుళ్లు రావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలతో దెబ్బతిన్న కట్ట మరమ్మతులకు ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి రూ.60 లక్షలు మంజూరు చేయించగా, నాణ్యత లోపంతో పనులు చేపట్టడం వల్లే పగుళ్లు వచ్చాయని ఆరోపిస్తున్నారు. 450 ఎకరాలకు నీరందించే చెరువు కట్టను మరమ్మతులు చేయాలి.