హైదరాబాద్: 28°C
వార్తలు

రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్‌కు జట్ల ఎంపిక

NZB: జిల్లాలో బాల్ బ్యాడ్మింటన్ సంఘం ఆధ్వర్యంలో పురుషుల, మహిళల జట్ల ఎంపికలు జిల్లా క్రీడా మైదానంలో నిర్వహించారు. ఎంపికైన క్రీడాకారులు ఆగస్టు 7 నుంచి 9 వరకు వనపర్తిలో జరిగే 72వ తెలంగాణ రాష్ట్రస్థాయి సీనియర్ బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో ఉమ్మడి జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. అసోసియేషన్ అధ్యక్షుడు గడ్డం శ్రావణ్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.