హైదరాబాద్: 28°C
వార్తలు

50 ఏళ్లకు కలుసుకున్న స్నేహితులు

NZB: నగరంలో వైశ్య ఉన్నత పాఠశాల(మానిక్ భవన్) 1976-77 పదో తరగతి పూర్వ విద్యార్థుల 50 వసంతాల స్వర్ణోత్సవం ఆదివారం నిర్వహించారు. ఈ వేడుకలో పూర్వ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆనాటి మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సత్కరించారు. 50 ఏళ్ల తర్వాత కలవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు.