హైదరాబాద్: 28°C
వార్తలు

3 ప్రదక్షిణలు చేస్తే.. గిరి ప్రదక్షిణతో సమానం

VSP: సింహాచలంలో ఈ నెల 28న జరిగే గిరి ప్రదక్షిణ చేస్తే భూప్రదక్షిణ చేసినంత పుణ్యఫలం లభిస్తుందని స్థానాచార్యులు తెలిపారు. గిరి ప్రదక్షిణ చేయలేని భక్తులు 29న పౌర్ణమి రోజు ఆలయం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే అదే ఫలితం లభిస్తుందని పేర్కొన్నారు. గిరి ప్రదక్షిణకు అన్ని ఏర్పాట్లు పూర్తైనట్లు వెల్లడించారు.