KMM: వరద ముంపు నివారణకు రూ.87 కోట్లతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు వేగంగా సాగుతున్నాయి. ఖానాపురం నుండి ధంసలాపురం వరకు 9 కిలోమీటర్ల మేర 475 మ్యాన్ హోల్స్‌తో నిర్మాణం జరుగుతోంది. దీనివల్ల 1.80 లక్షల ఇళ్లకు ముంపు తప్పుతుంది. పుట్టకోట శుద్ధి కేంద్రం పనులు ఆలస్యం కావడంపై స్థానికులు మండిపడుతున్నారు. నెల రోజుల్లో పనులుపూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.
వార్తలు
భూగర్భ డ్రైనేజీ పనులు ముమ్మరం


