హైదరాబాద్: 28°C
వార్తలు

'ఈ నెల 29న డీసెట్ అభ్యర్థులకు స్పాట్ అడ్మిషన్'

ADB: డీసెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ నెల 29న స్పాట్ అడ్మిషన్ల కోసం కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ అబ్దుల్ హై తెలియజేశారు. కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందన్నారు. అర్హత గల అభ్యర్థులందరూ తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని కోరారు.