హైదరాబాద్: 28°C
వార్తలు

జపాలి తీర్థం తాగునీటిపై టీటీడీ వివరణ

AP: తిరుమల జపాలి తీర్థం వద్ద కుళాయిలో తెల్లటి నీరు వస్తోందన్న ప్రచారంపై టీటీడీ స్పందించింది. అధిక ఒత్తిడి వల్ల గాలి బుడగలు ఏర్పడి నీరు తాత్కాలికంగా అలా కనిపిస్తుందని చెప్పింది. కొన్ని సెకన్లలోనే పారదర్శకంగా మారుతుందని తెలిపింది. ల్యాబ్ పరీక్షల్లో నీరు పూర్తిగా స్వచ్ఛమైనదేనని తేలిందని స్పష్టం చేసింది. భక్తులు అసత్య ప్రచారాలను నమ్మవద్దని కోరింది.