హైదరాబాద్: 28°C
వ్యాపారం

ఏఐపై ప్రజలకు నమ్మకం పోతోంది: సత్యనాదెళ్ల

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల కీలక వ్యాఖ్యలు చేశారు. ఐటీ రంగంలో మానవ ఉద్యోగాలను భర్తీ చేస్తుందనే భయాల కారణంగా ప్రజలు ఏఐ రంగంపై విశ్వాసం కోల్పోయారని అన్నారు. మానవుల పరిజ్ఞానం, సృజనాత్మకతకు ఏఐ సాంకేతికత కలిస్తేనే భవిష్యత్ సంస్థలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ఏఐని స్వతంత్ర మేధస్సుగా చూడకూడదన్నారు. మానవ ఆలోచనలను పెంచే, ప్రజల లక్ష్యాల సాధనకు దోహదపడే టూల్‌గా చూడాలన్నారు.